Home తాజా వార్తలు గ్రేటర్ వరంగల్ లో టిఆర్ఎస్ విజయం కోసం ఎన్ఆర్ఐల ప్రచారం

గ్రేటర్ వరంగల్ లో టిఆర్ఎస్ విజయం కోసం ఎన్ఆర్ఐల ప్రచారం

NRIs Campaign For TRS Victory In Greater Warangalవరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ ను గెలిపించాలని టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం నగర ప్రజలను కోరారు. ఆదివారం ఆయన ఎన్ఆర్ఐ కార్యదర్శి సత్యమూర్తి చిలుములతో కలిసి వరంగల్ నగరంలో టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కారు గుర్తుకే ఓటేయాలని అనిల్ ప్రజలకు పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ తోనే వరంగల్ అభివృద్ధి సాధ్యమని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బిజెపి నాయకుల కల్లబొల్లి మాటలను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.