Thursday, April 25, 2024

మెరుపు వేగంతో పులితో పోరాటం

- Advertisement -
- Advertisement -

NTR act in rajamouli direction movie RRR

రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ విజువల్ వండర్‌ని త్వరగా బిగ్ స్క్రీన్‌పై చూసేయాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆరాటపడుతున్నారు. రాజమౌళి వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్‌ల వీరోచిత పోరాటాలు, అద్భుత సన్నివేశాలతో సాగే ‘ఆర్ ఆర్ ఆర్’ కొరకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ ఓ సన్నివేశంలో పులితో తలపడతాడు. ఆ సన్నివేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో క్లిప్ లు చాలా రోజుల క్రితం బయటికి రావడం జరిగింది. ఈ ఫైట్‌లో చొక్కాలేకుండా గాయాలతో పులితో తలపడుతున్న ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ రేపింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ పులి ఫైట్ సన్నివేశంలో ఎన్టీఆర్ మెరుపు వేగం మైమరపిస్తుందట. దాదాపు ఐదు నిమిషాలకు పైగా సాగే పోరులో నువ్వా నేనా అన్నట్లు ఎన్టీఆర్ పులితో తలపడతాడట. ఈ సన్నివేశం సినిమాకే హైలెట్ అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News