Friday, April 19, 2024

కన్నుల పండువగా జరిగిన ఎన్టీఆర్ పురస్కారాల ప్రదానం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ నాంపల్లి : వివిధ రంగాల్లో అద్వితీయ సేవల ద్వారా ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న పలువురు వ్యక్తులకు పురస్కారాల ప్రదానం కన్నుల పండువగా జరిగింది. మహానటులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం ఎన్‌టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా కమలాకర లలితకళాభారతి సంస్థ పక్షాన నాంపల్లిలో తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం వేదికగా అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన సభా పర్వం శ్రీకారం జరిగింది. పలు రంగాల్లో ప్రతిభావంతంగా సేవలందిస్తున్న గుమ్మడి గోపాలకృష్ణ, వజన ఉదయ్, భగిరథ తదితరులు పురస్కారాలను స్వీకరించారు. తొలుత సంగీత విభావరి కార్యక్రమం ఆహుతులను చక్కని వినోదాన్ని పంచింది.

నాటి తెలుగు గడ్డపై బహుళ ప్రాచుర్యం పొందిన తెలుగు సినీ గీతాలను గాయకులు శ్రావ్యంగా, మృదుమధురంగా ఆలపించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు డాక్టర్ కేవీ రమణాచారి, మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, డాక్టర్ ఆవులప్ప, సాహితీ వేత్తలు ఓలేటి పార్వతీశం, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి, ఔన్నత్యం, వైభవాన్ని ఖండాంతరంగా వ్యాపించిన తెలుగు తేజం అని వక్తలు ఘనంగా శ్లాఘించారు. తెలుగు జాతి మహోన్నత వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరని ప్రస్తుతించారు. తెలుగు భాషా వ్యప్తికి ఆయన నిరంతరం కృషిచేశాసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News