Home సినిమా 21న ఆడియో, ట్రైలర్ లాంచ్ వేడుకలు

21న ఆడియో, ట్రైలర్ లాంచ్ వేడుకలు

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో, ట్రైలర్ లాంచ్ వేడుకలు ఈనెల 21న హైద రాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనున్నాయి. నం దమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చి ంది. ఈ వేడుకలో నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు పలువు రు పాల్గొనబోతున్నారు. ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు ‘ఎన్టీఆర్’ ఆడి యో వేడుక కార్యక్రమం మొదలుకానుంది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్‌రామ్, రానా దగ్గుబాటి, సుమంత్, జిస్సు సేన్ గుప్తా, నిత్యామీనన్, రకుల్‌ప్రీత్ సింగ్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

NTR Biopic Audio and Trailer Launching on 21st December

Telangana News