నందమూరి బాలకృష్ణకు ఎప్పటినుంచో డైరెక్షన్ చేయాలన్న ఆలోచన ఉంది. ఎప్పటికైనా మెగా ఫోన్ పడతానని చెబుతుంటాడాయన. బాలయ్య దర్శకత్వంలో అప్పట్లో ‘నర్తనశాల’ చిత్రం మొదలై అర్ధాంతరంగా ఆగిపోయింది కూడా. అయితే ఇప్పుడు ఆయన ఓ సోషల్ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. తన తండ్రి ఎన్టీఆర్ ఆత్మ కథతో… నాన్నగారి కథని బయోపిక్‌గా తీస్తానని అంటున్నాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ఇందులో తానే నటిస్తానని చెప్పడం విశేషం. స్వయంగా నటించి దర్శకత్వం వహిస్తానంటున్న ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఎన్టీఆర్ పాత్రకు బాలయ్య తప్ప మరెవ్వరూ పూర్తిగా న్యాయం చేయలేరని ఆయన అభిమానులు కూడా నమ్ముతున్నారు. ఓ పక్క దర్శకత్వం… మరోపక్క నటన అంటే బాలకృష్ణకు సవాలే. అందుకే దర్శకత్వ బాధ్యతను మరొకరికి అప్పగించి తాను దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉంటే ఎలా ఉంటుంది… అనే ఆలోచనలోనూ ఉన్నాడట. మొత్తానికి ఎన్టీఆర్ జీవిత కథతో ఓ సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది.
బాలకృష్ణ దర్శకత్వంలోనే ఎన్టీఆర్‌పై సినిమా?
- Advertisement -
- Advertisement -