Home తాజా వార్తలు తారక్ వాచ్ చాలా కాస్ట్‌లీ గురూ!

తారక్ వాచ్ చాలా కాస్ట్‌లీ గురూ!

NTRబాలీవుడ్ స్టార్స్ ప్రతి విషయంలో బ్రాండ్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. దుస్తులు, షూలు, వాచీలు, బ్యాగులు, కళ్లజోళ్లు ఇలా ప్రతి వస్తువులో ఎదో ప్రత్యేకత కనిపించేలా భారీగా వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు క్రీడకారులు సైతం ఈ విషయంలో ఏ మాత్రం తగ్గరు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్స్ కూడా చేరిపోయారు. తమ స్థాయికి తగ్గట్టుగా బ్రాండెడ్ వస్తువుల కోసం భారీగానే గుమ్మరిస్తున్నారు. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘టాక్సీవాలా’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం వేసుకొచ్చిన టీషర్ట్ ఖరీదు అక్షరాలా రూ.65 వేలు. బన్నీ అంత ఖరీదైన టీషర్ట్ వేసుకోవడంతో అభిమానులంతా షాక్ అయ్యారు.

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేనేమి తక్కువ కాదన్నట్టు చాలా ఖరీదైన వాచ్ తో అభిమానులకు షాక్ ఇచ్చాడు. రాజమౌళి కుమారుడి పెళ్లి కోసం జైపూర్ వెళ్లినప్పుడు విమానాశ్రయంలో మీడియా వారు తారక్ ని తమ కెమెరాల్లో బంధించారు. ఆ ఫోటోల్లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా సింపుల్ గా కనిపిస్తున్నా.. ఆ వాచ్ ధర ఎంతో తెలుసుకున్న అభిమానులు అవాక్కయ్యారట. తారక్ ధరించిన ఈ వాచ్ పై సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు పెద్ద చర్చ జరగుతోంది. ఆ వాచ్ రిచర్డ్ మెల్లే మెక్ లారెన్ కంపెనీదని సమాచారం. ఫార్ములా వన్ రేసర్లు అత్యంత ఖరీదైన ఈ వాచ్ లను ధరిస్తుంటారట. దీని ధర అక్షరాలా రూ. 2.20 కోట్లు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం తారక్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో మరో హీరోగా రామ్ చరణ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇది. దీంతో దీనిపై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి.

NTR Wrist Watch is going Viral in Social Media