Home తాజా వార్తలు కోట్లు కురుస్తాయంటూ నగ్న పూజలు

కోట్లు కురుస్తాయంటూ నగ్న పూజలు

Nude_manatelangana copyమన తెలంగాణ/మహబూబాబాద్: నల్లని కురులతో, తెల్లగా, అందంగా, ఉన్న మహిళలు నగ్న పూజలు చేస్తే కోట్లు కురుస్తాయంటూ మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగుచూసింది. గ్రామస్థుల కథనం మేరకు వరంగల్ జిల్లా మానుకోట పట్టణంలోని గిరిప్రసాద్‌నగర్ కాలనీలో బోడ కాంతమ్మ ఆర్థిక సమస్యలను స్థానిక మహిళలు మహబూబి, సుల్తానా బేగం పూజలు చేస్తే సమస్యలు పోతా యని నమ్మబలికారు. నల్లని పెద్ద కురులు, తెల్లని రంగు, ముఖ కళ ఉన్నవారు మాత్రమే నగ్న పూజకు అర్హులని, ఈ పూజ చేస్తే రూ.14 కోట్లు వస్తాయని, చెరిసగం తీసుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంతమ్మను ఆదిలా బాద్ జిల్లా మంచిర్యాలలో నకిలీ గురూజీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నగ్నంగా పూజలు చేయించారు. కాసులు కురవకపోవడంతో ఆమెను అక్కడ నుంచి దట్టమైన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి మరోసారి నగ్నంగా పూజలు చేయించారు. పూజ మధ్యలో వారు కత్తిని తీయడాన్ని గమనించిన కాంతమ్మ తన ప్రాణాలు తీస్తారేమోనన్న భయంతో వారి నుంచి తప్పించుకొని మాను కోటకు చేరుకుంది. ఈ పూజలు చేస్తే మీ ఆర్థిక బాధలు తీరిపోతాయని, కోట్ల రూపాయలు కురుస్తాయంటూ మరో బాధిత సరితను కూడా నగ్న పూజకు ఒడిగట్టారు. దీంతో బాధితురాలు మానుకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దారుణానికి పూనుకుంటున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టౌన్ ఎస్‌ఐ ప్రసాదరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.