Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి

రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి

Nurse killed in road accident at Yadadri Bhuvanagiriయాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌లో 65వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళతో పాటు మరో వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ నర్సు చనిపోయింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన నర్సును లక్ష్మిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం లక్ష్మి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.