Wednesday, April 24, 2024

వెరీ గుడ్డు

- Advertisement -
- Advertisement -

Egg

 

తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే పౌష్టిక ఆహారం కోడిగుడ్డు. గుడ్డులో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో… ప్రతిరోజూ ఒక గుడ్డు తినమని డాక్టర్లు కూడా చెబుతుంటారు. గుడ్డులో పలురకాల లవణాలు అరుదైన ఖనిజాల తో పాటు ఫాస్పరస్, అయోడిన్ సెలీని యం, ఐరన్, జింక్ ఉన్నాయి. గుడ్డులో విటమిన్‌ఇ మెండుగా ఉంటుంది. గుడ్డును రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, వ్యాధినిరోధకశక్తి కూడా పెరుగుతుంది.

 

వడ

కావాల్సినవి : గుడ్లు రెండు, శనగపిండి రెండు కప్పులు, మొక్కజొన్న పిండి రెండు చెమ్చాలు, ఉప్పు, కారం, గరంమసాలా చమ్చా చొప్పున, పచ్చిమిర్చి మూడు, వెల్లుల్లి పది రేకలు, తోటకూర ఒక కట్ట, అల్లం కొద్దిగా, వరిపిండి రెండు కప్పులు, ఉల్లిపాయలు రెండు.

తయారీ : ముందుగా గుడ్లని కొట్టి సొనని బాగా కలపాలి. అందుల్లో ఉప్పూకారం వేసి కలపాలి. తర్వాత శనగపిండి, వరిపిండి, గుడ్ల సొనాలో కలపాలి. మొక్కజొన్న పిండిని దానిలో వేసి కలపాలి. పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి, తోటకూర, ఉల్లిపాయలను సన్నగా తరిగి కలపాలి. ఇప్పుడా మిశ్రమాన్ని చేత్తో అద్ది వడాలుగా వత్తుకొని వేయించుకోవాలి. అందులో వెల్లుల్లి రేకలను పొట్టు తీసి అలానే వేసుకుంటే రుచిగా ఉంటాయి.

 

రోల్ 

కావాల్సినవి : గుడ్లు రెండు, బ్రెడ్ ముక్కలు రెండు, బీన్స్ ముక్కలు ఒక టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి రెండు, మిరియాలపొడి అర టీస్పూను, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె సరిపడా.

తయారీ : ముందుగా గుడ్డు సొనని మిక్సీలో వేసుకోవాలి. ఒక గిన్నెలో సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్‌పొడి, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలపొడి, పసుపు, ఉప్పు, మిక్సీలో వేసిన గుడ్డు సొన వేసి బాగా కలపాలి. స్టవ్ మీవ పెనం పెట్టి సరిపడా నూనె పోసి పలచగా ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ వేగాక గుండ్రంగా మడవాలి. దీన్ని టొమాటో సాస్‌తో తింటే ఇంకా రుచిగా ఉంటుంది.

 

బజ్జీ

కావాల్సినవి : కోడి గుడ్లు ఐదు, శనగపిండి పావుకిలో, తినే సోడా చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, బజ్జీ మసాలా ఒకటేబుల్ స్పూన్, కొత్తిమీర కట్ట, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా.

తయారీ : కోడి గుడ్లని ఉడికించి పొట్టు తీసి పక్కనబెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి వేసి తగినంత ఉప్పు, తినే సోడా వేసి జారుగా కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉడికించి పెట్టుకున్న గుడ్డుని పిండిలో ముంచి నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసి ప్లేట్‌లకి వేసుకోవాలి. ఎగ్ బజ్జీని మధ్యలో కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, బజ్జీ మసాలా వేసి కొత్తిమీరతో అలంకరించుకుంటే ఇంకా బాగుంటుంది.

 

ఫ్రై

కావాల్సినవి : ఉడికించిన గుడ్లు నాలుగు, ఉల్లిపాయలు పెద్దవి రెండు, పచ్చిమిర్చి మూడు, అల్లంవెల్లుల్లి ముద్ద ఒక టేబుల్‌స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ, పసుపు చిటికెడు, కారం రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరిపొడి రెండు టేబుల్‌స్పూన్లు, ధనియాలపొడి టేబుల్‌స్పూను, గరంమసాలా అర టీస్పూను, ఉప్పు తగినంత, నూనె సరిపడా, కొత్తిమీర పావు కప్పు.

తయారీ : కడాయిలో నూనె వేసి వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, వేసి మెత్తబడేవరకు వేయించాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తర్వాత పసుపు, కారం, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఉడికించిన గుడ్లను సగానికి కోసి కూరలో వేయాలి. ఇప్పుడు గరంమసాలా, కొబ్బరిపొడి వేసి ఇంకోసారి కలిపి మూత పెట్టి మూడు నుండి ఐదు నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉడికించాలి. తర్వాత మూత తెరిచి కొత్తిమీర వేసి దించేయాలి.

Nutritional food is Egg
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News