Home అంతర్జాతీయ వార్తలు విలపించిన ఒబామా

విలపించిన ఒబామా

విచ్చలవిడి తుపాకీ విక్రయ విధానానికి బలి అవుతున్న
చిన్నారులను తలచుకొని కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు

obamaవాషింగ్టన్: తుపాకీ సంస్కృతి ఏటా అమెరికాలో వేలాదిమందిని బలితీసుకొంటున్న విషయం ప్రస్తా వించి అమెరికా అధ్యక్షుడు ఒబామా బుధవారం బహిరంగంగా ఏడ్చేశారు. వందలాదిమంది ప్రజ ల సమక్షంలో ఆయన తుపాకి సంస్కృతిని తలచు కొని భావోద్వేగానికి లోనై విలపించారు.  ఆ విష సంస్కృతి పనిపట్టడానికి అనేక చర్యలను ఆయన ప్రకటించారు. అయితే ఆయన ప్రకటించిన చర్యల లో తుపాకులపై   నియంత్రణ చర్యలకు రిపబ్లికన్ల అధీనంలోని కాంగ్రెస్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయింది.
తుపాకులకు బలైన ఆ చిన్నపిల్లల ఆలోచన నన్ను పిచ్చివాణ్ణి చేస్తోందని ఒబామా వైట్ హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో సామూహిక కాల్పుల బాధితుల సమక్షంలో అంటున్నపుడు ఆయన కళ్ల వెంట కన్నీటిబొట్లు జలజలా రాలాయి. కన్నెక్టికట్‌లోని న్యూటౌన్‌లో మూడేళ్ల క్రితం 20 మంది ప్రాథమిక స్థాయి బడి పిల్లల సామూహిక కాల్చివేత ఘటనను ఆయన గుర్తుకు తెచ్చుకొన్నారు. ప్రభుత్వ చర్యలను అడ్డుకోడానికి అమెరికా తుపాకుల లాబీప్రయత్నాలను ఉపేక్షించబోమని ఒబామా హెచ్చరించారు. ఈ తుపాకుల లాబీ ఇప్నటికిప్పుడు అమెరికా కాంగ్రెస్‌ను తన గుప్పిట్లో బందీలుగా ఉంచవచ్చు కాని వారు మొత్తం అమెరికాను అలా చేయలేరు అని ఆయన అన్నారు. మన ఇతర హక్కులు కూడా ముఖ్యమైనవి అని చాటడానికి మనమంతా హక్కుల మధ్య పొంతన సాధించే కృషి చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని రెండవ సవరణ హక్కులు ముఖ్యమేకాని అంతకంటె ముఖ్యమైన హక్కులను మనం పట్టించుకొంటున్నామని ఒబామా చెప్పారు. వాటి మధ్య పొంతన అవసరమని తెలిపారు. ‘స్వేచ్చగా పూజ చేసుకొనే హక్కు మనకుంది. కాని దక్షిణ కరొలినాలోని చార్లెస్‌టన్‌లో క్రిస్టియన్లకు ఆ హక్కు తిరస్కరణకు గురైందని చెప్పారు. కన్సాస్ సిటీలో యూదులకు, చాపెల్ హిల్‌లో ముస్లిమ్‌లకు, ఓక్ క్రీక్‌లో సిక్కులకు కూడా అదే జరిగిందని అన్నారు. జీవించడానికి, స్వేచ్చకు, ఆనందించడానికి మనందరకూ హక్కులు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ హక్కులను బ్ల్లాక్స్ బర్గ్ , శాంతా బార్బరా కాలేజీ విద్యార్థులకు లేకుండా చేశారు. అలాగే కొలంబైన్‌లో హైస్కూల్ వంవిద్యార్థుల హక్కులు కొల్లగొట్టారు. అరోరాలో సినిమా చూడ్డానికి వెడుతున్నవారిని కూడా వదల్లేదని తుపాకి సంస్కృతి బలిపీఠాన్ని గురించి ఆయన సోదాహరణంగా వివరించారు. తుపాకి నుంచి దూసుకువచ్చే బుల్లెట్ తమ ప్రియతములను తీసుకు పోతుందని ఎవరూ అనుకోరు అని ఆయన ఉద్వేగంతో అన్నారు. ఈ విష సంస్కృతి బారిన పడి అసువులు బాసినవారిలో ఒకటో తరగతి పిల్లలు కూడా ఉన్నారని ఆవేదనతో అన్నారు. తుపాకి లాబీని ఎదురొడ్డగల ధైర్యం కాంగ్రెస్‌కు ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల క్షేమానికి కృషి చేయాల్సిందిగా గవర్నర్లను, చట్టసభల సభ్యులను, వ్యాపారులను కోరాలని సూచించారు.