Tuesday, April 16, 2024

కప్పల చెరువు నాలా మింగేశారు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో రియల్టర్ల కబ్జాలకు హద్దే లేకుండా పోతోంది. చెరువులు, నా లాలు, కాల్వలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ప్లాట్‌లు వేసి అమ్ముకోవడం పరిపాటిగా మారింది. ఇదే కోవలో తాజాగా ఎల్‌బి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో హైవే సమీపంలో ఓ బడా రియల్ ఎ స్టేట్ కంపెనీ అభివృద్ధి చేసిన వెంచర్‌లో ఓ నాలా కనిపించకుండా పోయింది. ఆ నాలా కాంపౌండ్ వాల్ వర కూ వచ్చి ఆగిపోయింది. ఆ నాలా ఎటు వెళ్లిందో తెలియక జిహెచ్‌ఎంసి అధికారులు కూడా వెతుకుతున్నా రు. కోట్లు ఖర్చు చేసి స్థలాలను కొనుగోలు చేసిన కం పెనీ నాలాను దారి మళ్లించి కక్కుర్తిపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. హయత్‌నగర్ మండలంలోని సాహెబ్‌నగర్‌లో కప్పల చెరువు ఉంది. ఈ చెరువు నిండితే నాలా నుంచి కింది చెరువులకు నీళ్లు వెళ్తాయి.

ఆ ప్రాంతంలో గొలుసుకట్లు చెరువులున్నాయి కూడా. పె ద్ద అంబర్‌పేట్ వరకూ ఈ నాలాలో నీరు ప్రవహిస్తుంది. అయితే ఆ నాలా కబ్జా కాకుండా ఉండేందుకు “ఇక్కడ లోతైన నాలా-డ్రైయిన్ ఉన్నది, డేంజర్ ఎవరూ ఇటు రావద్దు”, చెత్త వేసినచో జరిమానా విధిస్తాం” అంటూ బల్దియా కమిషనర్ పేరిట సర్కిల్-3 డిప్యూటీ కమిషనర్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడది అలంకారప్రాయంగా కనిపిస్తోంది. ఆ నాలాకు అడ్డంగా గోడ కట్టారు. అక్కడ చిన్న పైపు గోడ మధ్యలో దూర్చివదిలేశారు. పైనుంచి వచ్చే నీటిని ఎటు పంపుతారో మాత్రం అర్థ్ధంకావడం లేదు. కప్పల చెరువు కూడా ఎల్లప్పుడూ నీటితో కళకళలాడుతూ ఉంటుంది. మామూలుగానైతే సాధారణ వర్షాలు కురిస్తేనే కప్పల చెరువు నిం డుతుందని, ఇక భారీ వర్షాలు కురిస్తే వెంటనే ఈ నాలా పొంగుతుందని స్థానికులు చెబుతున్నారు.

ఈ నాలా కబ్జా బాగోతంపై ఒక స్థానిక ప్రజాప్రతినిధి జిహెచ్‌ఎంసి కమిషనర్, సంబంధిత అధికారులకు నవంబర్ 22న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును చేపట్టిన కంపెనీ నాలాకు అడ్డంగా గోడ కట్టడమంటే కక్కుర్తిపడడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా వెంచర్ మధ్యలో నాలా ఉన్నట్లయితే ప్లాట్ల విలువ పడిపోతుందనే ఉద్దేశ్యంతోనే నాలాను కూడా వెంచర్‌లో కలిపేసుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నాలాకు వరదనీరు వస్తే ఆ వెంచర్ మునిగిపోవడమే కాకుండా వరదనీరంతా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుందని, ఆ ప్రాంతం మొత్తం జలమయమవుతుందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ఈ లే అవుట్ ప్రచారం హల్‌చల్ చేస్తోందని వివరించారు. ఇందుకోసం అందమైన బ్రోచర్లను ముద్రించారు.

వీటిని వాట్సప్, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూన్నారు. ఆఫర్ ధర గజం 60 వేల రూపాయలంటూ ఫోన్లు చేయిస్తున్నారని స్థానికులు వివరించారు. ప్లాట్ సైజు 126 గజాల నుంచి 1846 గజాల వరకూ ఉంటుందని, ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమేనని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఆఫర్ గడువు ముగిసిన తర్వాత గజం 65 వేలు, ఈస్ట్ ఫేస్, కార్నర్ బిట్స్ అయితే అధికం, క్లబ్ హౌస్‌ను వినియోగించుకోవాలంటే చదరపు అడుగుకు రెండు రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News