Home పెద్దపల్లి ఒసిపి-3 ప్రాజెక్టు బేస్‌వర్క్‌షాప్ క్యాంటీన్ సాంబారులో ముల్లు

ఒసిపి-3 ప్రాజెక్టు బేస్‌వర్క్‌షాప్ క్యాంటీన్ సాంబారులో ముల్లు

OCP-3 project base workshop canteen in sambar thorn

సంక్షేమాధికారులపై కార్మికుల ఆగ్రహం
అధికారి హామీతో శాంతి

మనతెలంగాణ/యైటింక్లయిన్‌ కాలనీ: సింగరేణిలోని క్యాంటీన్‌లను ఆధునీకరిస్తాం, చక్కటి ప్రోటీన్లు ఉన్న ఆ హారాన్ని అందిస్తామని చెబుతున్న యాజమాన్యం ఇచ్చే ఆహారాన్ని సైతం శుభ్రంగా ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. తాజాగా ఆర్‌జి2 డివిజన్ పరిధిలోని ఓసిపి3 ప్రాజెక్టు బేస్‌వర్క్‌షాప్‌లో ఉదయం సాంబారు ఇడ్లీలు కార్మికులకు అందించారు. ఒక కార్మికునికి పెద్ద తుమ్మ ముల్లు సాంబారులో ప్రత్యక్షమైంది. ఒకవేళ చూడకుండా తింటే తమ పరిస్థితి ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమాధికారుల పర్యవేక్షణ సక్రమ ంగా లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన చక్కటి ఆహారాన్ని అందించలేని సంక్షేమాధికారులు కనీసం ఇచ్చే పదార్థాలను సై తం శుభ్రంగా ఇవ్వడంలో విఫలమవుతున్నారని అగ్రహం వ్యక్తం చే శా రు. సాంబారులో వచ్చిన ము ల్లు ను బేస్‌వర్క్‌షాప్ హెడ్ వద్దకు తీసుకె ళ్లి చూపించారు. కొద్ది సేపు కార్మికు లు ఆందోళన చేశారు. యాజమాన్యం పై అగ్రహం వెలిబుచ్చారు. ఇక ము ందు ఇలాంటివి పునరావృతం కా కుండా చూస్తామని అధిపతి హామి ఇవ్వడంతోకార్మికులుశాంతించారు.