Thursday, April 18, 2024

పృథ్వీషాకు చోటు

- Advertisement -
- Advertisement -

New Zealand series

 

కివీస్ సిరీస్‌కు వన్డే జట్టు ఎంపిక

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బుధవారం ఎంపిక చేశారు. గాయపడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీషాను ఎంపిక చేశారు. పృథ్వీషా ప్రస్తుతం ఇండియాఎ తరఫున న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్నాడు. అక్కడి పిచ్‌లపై షా మెరుగైన ఆటను కనబరుస్తుండడంతో అతన్ని జట్టులో చోటు కల్పించారు. ధావన్ దూరమైన నేపథ్యంలో స్పెషలిస్ట్ ఓపెనర్‌గా షాకు స్థానం దక్కింది. ఇక, ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా జట్టుకు ఎంపికయ్యాడు. సీనియర్ ఆటగాడు కేదార్ జాదవ్ వన్డే జట్టులో చోటు నిలుపుకున్నాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రాలు బౌలింగ్ భారాన్ని మోపనున్నారు.

వీరితో పాటు యువ బౌలర్లు శార్ధూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనిలు కూడా జట్టుకు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్ల భూమికను రవీంద్ర జడేజా, శివమ్ దూబేలు పోషించనున్నారు. ఠాకూర్, కేదార్‌లు కూడా ఇటు బంతితో అటు బ్యాట్‌తో రాణించే సత్తా కలిగిన వారే. దీంతో వీరికి కూడా కివీస్ వన్డే సిరీస్‌లో చోటు లభించింది. కివీస్ పర్యటనలో భాగంగా భారత్ మూడు ట్వంటీ20లు, మరో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే టి20 జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా, గాయపడిన ధావన్ స్థానంలో సంజు శాంసన్‌ను టి20 జట్టుకు ఎంపిక చేశారు.

ODI team selection for New Zealand series
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News