Friday, March 29, 2024

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన ఒడిశా..

- Advertisement -
- Advertisement -

 

భువనేశ్వర్: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండడంతో లాక్ డౌన్ విషయంలో ఒడిసా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందని ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. దీంతో దేశంలో లాక్ డౌన్ ను పొడిగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. మార్చి 24న ప్రధాని నరేంద్ర మోడీ కరోనాను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మర్కజ్ కారణంగా దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.దీంతో కరోనాను అరికట్టేందుకు మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడిగించాలనే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ఒడిశా ప్రభుత్వం… రాష్ట్రంలోని అన్నీ విద్వాసంస్థలు జూన్ 17 వరకు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో రైళ్లు, ఎయిర్ సర్వీస్ లను ప్రారంభించొద్దని నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని కోరారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 42 కరోనా పాజిటీవ్ కేసుల నమోదు కాగా, కరోనాతో ఒకరు చనిపోయారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒడిశాలో కరోనా కేసులు తక్కువగా నమోదైనప్పటికీ ముందు జాగ్రత్తగా లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Odisha Govt Extends Lockdown till April 30

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News