Home తాజా వార్తలు ఎమ్మెల్సీ ఓటర్లకు ఎర!

ఎమ్మెల్సీ ఓటర్లకు ఎర!

Political

విహార యాత్రకు.. ఆఫర్
నల్లగొండ టు ముంబై
రసవత్తరంగా మారుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమరం
గెలుపు ధీమాలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ
పరువు కోసం కాంగ్రెస్ పాకులాట
క్యాంపు రాజకీయాలకు తెరలేపిన పార్టీలు
ఇప్పటికే ముంబై చేరిన పలువురు ప్రజాప్రతినిధులు

వరుస ఎన్నికలతో గత కొన్ని రోజులుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న అధికారులు, ప్రజలు మరో ఎన్నికను రసవత్తరంగా తిలకించేందుకు కుతుహలపడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి కోసం రసవత్తర పోరు నడుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనమాతో ఖాళీ ఏర్పడింది. ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఓటు వేసే హక్కు కలిగి ఉన్నారు.ఈ నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. మరికొద్దిరోజుల్లో పదవి వియోగం పొందనున్న ఎంపిటిసి, జెడ్‌పిటిసి కౌన్సిలర్లకు విహార యాత్ర అవకాశం రావడంతో వారి సంతోషానికి పట్టపగ్గాలు లేకుండాపోయాయి. ఈ నెల 31వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. టిఆర్‌ఎస్ నుండి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నుండి కోమటిరెడ్డి లక్ష్మీ పోటీలో ఉన్నారు. మరికొందరు స్వతం త్ర అభ్యర్థులుగా ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే ఉంటుం ది. గత ఎన్నికలలో అత్యధిక ఎంపిటిసి, కౌన్సిలర్లు, జెడ్‌పిటిసి సభ్యులు ఉన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డినివిధి వెక్కిరించింది.

కాంగ్రెస్‌కు విజయం వరించడంతో రాజగోపాల్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సారి తిరిగి పోటీ లో అధికార పార్టీ అభ్యర్ధిగా చిన్నపరెడ్డి పోటీలో ఉండగా రాజగోపాల్‌రెడ్డి భార్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. దీంతో విజయం నల్లేరు పై నడకేనన్న చందంగా తెరాస పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. గత ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పరువు కోసం పాకులాడుతోంది. ఇప్పటికే గతం కన్న ఎక్కువ మంది సభ్యులు తెరాస మొగ్గు చూపారు. గరిష్టం గా రెండింట మూడు వంతుల మెజారిటీ పైనే టీఆర్‌ఎస్‌లో ఉన్నాయి. అ యినప్పటికీ పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం విహార యాత్రలు మాత్రం ఓటర్లు చేరుతున్నారు. నల్లగొండ టీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపిటిసి సభ్యులు, జెడ్‌పిటిసి సభ్యులు బెంగళూరు నుండి విమానంలో ముంబై చేరుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అక్కడ అరేబియా సముద్రంలో ఉన్న ఎస్సెల్ వరల్డ్ ద్వీపంలో వారికి బస ఏర్పాటు చేసినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలోని ఎంపిటీసి, జెడ్పిటీసి సభ్యులు, కౌన్సిలర్లు కూడా శుక్రవారం రాత్రి బయలుదేరుతున్నట్లు సమాచారం. వారు కూడా ముంబై చేరుకోనున్నట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధ ఒకరు తెలిపారు. సూర్యాపేట జిల్లాకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపిటీసి సభ్యులు, జెడ్పిటీసి సభ్యులను రాత్రికి హైదరాబాద్ చేరుస్తూ అక్కడి నుండి బెంగళూరు నుండి ముంబైకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

తిరిగి అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలలోని దర్శణీయ స్థలాలను సూచించి 30వ తారకు వర కు చేరుకోనున్నట్లు అధికార పార్టీ నాయకులు తెలుపుతున్నారు.యాదాద్రి భువనగిరికి చెందిన ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకొని మహారాష్ట్రకు చేరుకోనున్నారు. వారిని ప్రత్యేక వాహనాల ద్వారా బెంగళూరు, మైసూర్ ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా వారి పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో విజయమే లక్షంగా మంత్రి జగదీష్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. విజయం కన్న మెజారిటీపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధులు తెరాసలో చేరారు. ఎక్కడో కొన్ని ప్రాంతాలలో మాత్రమే వేళ్ల మీద లెక్కబెట్టేంత మంది వివిధ పార్టీలలో ఉన్నారు. గత ఎన్నికల బలాబలాలను పరిశీలిస్తే టీఆర్‌ఎస్‌కు సుమారు 650, కాంగ్రెస్‌కు 342 కాగా ఇతరులు 94 మంది ఉన్నట్లు సమాచారం. ఇతరులలో ఎక్కువ మంది అధికార పార్టీ వైపే మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్‌లోని కొంత మంది సభ్యులు ఇప్పటికే టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉండడంతో తేరా చిన్నపరెడ్డి విజయం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 43 జెడ్పిటీసి స్థానాలను, టీఆర్‌ఎస్ 13 స్థానాలను, తెలుగుదేశం రెండు స్థానాలను, సిపిఐ ఒక స్థానాన్ని గెలుచుకుంది.

కానీ ఎక్కువ మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. జెడ్పి ఛైర్మన్ బాలునాయక్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరి గత శాసనసభ ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అయినప్పటి నుం డి వచ్చిన వారు.. వెళ్లిన వారు టీఆర్‌ఎస్‌కే మద్దతుగా ఉన్నారు. నాలుగు మున్సిపాలిటీలలో ఉన్న కౌన్సిలర్లలో అధిక మొత్తంలో టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారు. సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడలో టిడిపిలో నుండి గెలిచిన కౌన్సిలర్లు అధిక మొత్తంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపిటీసి సభ్యులలోనూ 835 మంది ఉండగా వారిలో అధికంగా టీఆర్‌ఎస్‌లో చేరడంతో టిడిపి దాదాపు కనుమరుగైంది. స్వతంత్రులు, సిపిఐ, సిపిఎంలో ఎక్కువ మందితో వైకాపా సభ్యులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరా రు. దీంతో టీఆర్‌ఎస్ బలం భారీగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1110 మంది ఓటర్లు ఉండగా వారిలో ఎక్కువ మంది టీఆర్‌ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ ఆశిస్తున్నట్లుగా వారికి మద్ధతు నామమాత్రంగానే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో అక్కడ సభ్యులు తేరా చిన్నపరెడ్డికే మద్ధతు పలుకుతున్నారు. గత ఎన్నికల్లో తేరా చిన్నప రెడ్డి నుండి లబ్ధిపొందిన వారు ఈ సారి పక్కాగా ఆయనకే ఓటేసేందుకు సిద్ధమవుతున్నా రు.

జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డి దాదాపుగా పది నియోజకవర్గాల బాధ్యతలను తీసుకొని పక్కాగా ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీల ద్వారా పట్టు బిగించారు. హుజూర్‌నగర్‌లో పార్టీ ఇన్‌ఛార్జి శానంపూడి సైదిరెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మునుగోడులో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఇన్‌ఛార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో అక్కడి సభ్యులను క్యాం పులను తరలించినట్లు తెలుస్తోంది. వివిధ నియోజకవర్గాల నుండి అనువైన ప్రదేశంను ఎంచుకొని దక్షిణ భారతదేశం, ఉత్తరభారతదేశంలోని ప్రాంతాలకు సభ్యులను తరలించినట్లు సమాచారం. ఈ నెల 30వ తేదీన సభ్యులు తిరిగి జిల్లాలోని సొంత కేంద్రాలకు చేరుకుంటారని అధికార పార్టీ నాయకుడు ఒకరు వెల్లడించారు.

Offer to Nalgonda to Mumbai picnic