Thursday, April 25, 2024

ఈటల భూములపై మళ్లీ విచారణ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: మాజీమంత్రి, హుజూరాబాద్ ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. కొవిడ్ కారణంగా నిలిచిన సర్వే ప్రక్రియ హైకోర్టు ఆదేశానుసారం కొనసాగనుంది. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామ శివారులో ఈటల కుటుం బీకులు ఎస్‌సి, ఎస్‌టిల భూములను బలవంతంగా కబ్జా ఆరోపణలపై గతంలో జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నిబంధనల ప్రకారం సర్వే చేపట్టి నివేదిక రూపొందించాలన్న హైకోర్టు ఆదేశంతో రెవిన్యూ అధికారులు సోమవారం పరిశ్రమ ప్రతినిధులకు నోటీసులు అందజేశారు. కోవిడ్ కారణంగా జూన్ నెలాఖరులోపు నర్వే ప్రక్రియ చేపట్టకపోవడంతో గతంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పుకు అనుగూనంగా ఈనెల 16, 17, 18 తేదిలలో 77,78,79,80, 81,82,97,130 సంబధించిన సర్వే నెంబర్లలో విచారణ నిర్వహించడానికి హైకోర్ట్ తాజా ఉత్తర్వులను జారీ చేసిందని జిల్లా కలెక్టర్ హరీశ్ సోమవారం తెలిపారు. ఈ సర్వే నెంబర్లకు సంబం ధించిన ఈటల జమున, నితిన్ లతో కలిపి 156 మంది రైతులకు విచారణకు సంబంధించిన నోటీసులను అందజేశారు. గతంలో జమున హేచరీస్ 65 ఎకరాల్లో అసైన్డ్ భూమిని కబ్జా చేశారని రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విజిలెన్స్, ఎసిబి అధికారులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందేనన్నారు. అచ్చం పేట, హక్కింపేట గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు జమున హేచరీస్, పౌల్ట్రీఫామ్‌కు సంబంధించిన సుమారు 175 ఎకరాల్లో చేపట్టిన డిజిటల్ భూ సర్వేలో దాదాపు 65 ఎకరాల సీలింగ్ భూమి గా ప్రాథమిక నిర్దారణ తేలిందని కలెక్టర్ తెలిపారు. సర్వే ఆపాలని జమున హేచరిస్ మేనేజ్‌మెంట్ హైకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. అయితే తాజాగా సోమవారం హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటిసులు జారీ చేశారని, అందుకు గాను ఈ నెల 16, 17, 18న సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

Officers Issued Notices to Jamuna Hatcheries

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News