Friday, April 19, 2024

అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి

- Advertisement -
- Advertisement -

Officially Ilamma Jayanthi and Vardhanthi events

నిర్ణయం తీసుకున్న సిఎం కెసిఆర్… వెనువెంటనే ఉత్తర్వులు జారీ

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ, చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి , వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు నిర్ణయించారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దయాకర్‌రావు

మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి,వర్థంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ చాకలి ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26వ తేదీన జన్మించారు. 1985 సెప్టెంబర్ 10వ తేదీన మరణించారు. తెలంగాణ పోరాట యోధులను గుర్తించి, తగిన గౌరవం కల్పించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ముందుంటారని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైన చాకలి ఐలమ్మ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఆమె చేసిన సాయుధ పోరాటమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News