Home తాజా వార్తలు ప్రతి రెండు సెకన్లకు ఒక ఇ-స్కూటర్

ప్రతి రెండు సెకన్లకు ఒక ఇ-స్కూటర్

Ola building the world largest electric scooter factory

 

తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీ
ప్లాంట్ కోసం రూ.2 వేల కోట్ల పెట్టుబడులు
ప్రకటించిన ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్

ముంబై : తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు క్యాబ్ సేవల సంస్థ ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ప్రకటించారు. 2022 వేసవి నాటికి ఈ ప్రతిపాదిత ప్లాంట్ ద్వారా వార్షికంగా కోటి వాహనాలు ఉత్పత్తి చేయనున్నామని, అంటే ఇది ప్రపంచ ఇస్కూటర్ల సామర్థంలో 15 శాతం వరకు ఉంటుందని తెలిపారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే 12 వారాల్లో ప్లాంట్‌ను నిర్మాణం చేపట్టాలనేది అగర్వాల్ లక్షం. ప్లాంట్‌ను వచ్చే ఏడాది విస్తరించిన తర్వాత ప్రతి రెండు సెకన్లకు ఒక స్కూటర్‌ను తయారు చేస్త్తుంది. ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ చిత్రాలను దేశీయ మార్కెట్ కోసం అధికారికంగా సోషల్ మీడియా ట్విట్టర్‌లో విడుదల చేసింది. ఈ ప్లాంట్‌ను తమిళనాడులోని కృష్ణగిరిలో 500 ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు. దీనికోసం ఓలా రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దేశీయ డిమాండ్‌తో పాటు ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా మార్కెట్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లను సరఫరా చేయాలని కంపెనీ లక్షంగా చేసుకుంది.

ఏడాదికి కోటి యూనిట్ల సామర్థ్యం
ప్లాంట్ మొదటి దశలో ఈ సంవత్సరం జూన్ నాటికి ఏడాదికి 20 లక్షల యూనిట్ల సామర్థ్యం కల్గివుంటుంది. 2022 నాటికి ప్లాంట్ మొత్తం సామర్థ్యం సుమారు కోటి యూనిట్లు అవుతుంది. ప్లాంట్ పూర్తిగా పనిచేసిన తర్వాత ప్రతి రెండు సెకన్లలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ అంచనా వేసింది. గతేడాదిలో డచ్ ఆధారిత ఇటార్గో బివిని కొనుగోలు చేసిన తరువాత సున్నా ఉద్గార ఉత్పత్తుల్లోకి ప్రవేశించే ప్రయత్నాలను ఓలా ముమ్మరం చేసింది. ఓలా మొదటి స్కూటర్ ఇటార్గో యాప్ స్కూటర్ ఆధారంగా పనిచేస్తుంది. సంస్థ ఇప్పటికే దాని యాప్ స్కూటర్ వెర్షన్‌ను పరీక్షిస్తోంది. మొదటి అధికారిక ఫోటోలు కూడా రెండింటి మధ్య సారూప్యతను చూపుతున్నాయి. చిత్రాలలో స్కూటర్ బాడీ ప్యానెల్‌పై ఫ్యూచరిస్టిక్ విధానంతో క్లీన్ ప్రొఫైల్‌ను ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందు భాగంలో ట్విన్ హెడ్‌ల్యాంప్‌లు, తక్కువ- స్పేస్ టర్న్ సిగ్నల్స్ చూడవచ్చు. ఇవి కాకుండా బ్లాక్ అల్లాయ్ వీల్స్, కర్వ్‌డ్ ఫ్రంట్ లోడింగ్ స్పేస్, బ్లాక్ గ్రాబ్రేల్ ఉన్నాయి.

240 కి.మీ. వరకు పరిధి
ఇది ఇటార్గో యాప్ స్కూటర్ మాదిరిగానే ఉంటుంది. 240 కి.మీ.ల శక్తి సాంద్రత కలిగిన బ్యాటరీతో వస్తుంది. పరిధి స్కూటర్‌కు -45 కి.మీ ఉంటుందని చెబుతున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 4జి సపోర్ట్, బ్లూటూత్, వైఫై, నావిగేషన్, ఒటిఆర్ అప్‌డేట్, ఫైండ్ మై స్కూటర్‌తో సహా పలు అధునాతన ఫీచర్లు ఉంటాయి. సస్పెన్షన్ కోసం దీనిని హైడ్రాలిక్ 200 ఎంఎం ఫ్రంట్ డిస్క్, టెలిస్కోపిక్ సింగిల్ షాక్ హెడ్‌స్టాక్, మౌంటెడ్ షాక్ అబ్జార్బర్‌తో 180 ఎంఎం రేర్ డిస్క్ బ్రేక్‌ను అమర్చే అవకాశముంది. 2021 రెండో భాగంలో ప్రారంభించవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రయోగం ఈ సంవత్సరం రెండో భాగంలో ఉంటుంది. దాని ధర వినియోగదారులను ఆకర్షించేలా ఉండవచ్చు. పెట్రోల్ ధర పెరుగుతున్నందున, ఈ సమయంలో ప్రజలు బ్యాటరీతో నడిచే వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు.

Ola building the world largest electric scooter factory