Home జాతీయ వార్తలు 108కు ఫోన్ చేస్తే… ఓలాలో పొమ్మన్నారు…. (వీడియో వైరల్)

108కు ఫోన్ చేస్తే… ఓలాలో పొమ్మన్నారు…. (వీడియో వైరల్)

 

చెన్నై: తమిళనాడులోని చెన్నైలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు పోతున్నాయని అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే ఓలా క్యాబ్‌కు ఫోన్ చేయాలని 108 సిబ్బంది ఉచిత సలహాలు ఇచ్చారు. చిట్లపక్కమ్ ప్రాంతంలో 42 సంవత్సరాల వయసు గల సెతు రాజ్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ తగలడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు అతడి భార్య 108 కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసింది. 108 సిబ్బంది ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ రాదని ఓలా క్యాబ్‌కు ఫోన్ చేయాలని సూచించింది. దీంతో ఆమె ఖంగుతిన్నది. వాట్సాప్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. సెతు రాజ్ గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తమిళ నాడు ఆరోగ్య శాఖ మంత్రి సి విజయ్ భాస్కర్ ఈ వ్యవహారంపై విచారం వ్యక్తం చేశారు. ప్రతీ 108 వాహనానికి జిపిఎస్ సిస్టమ్ అనుసంధానం చేశామని వివరించాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సెథూరాజ్ తన ఇంట్లో కుక్కలకు ఆహారం అందిస్తుండగా కరెంట్ షాక్‌కు గురై చనిపోయాడు.

 

Ola if want to go to a Private Hospital in Chennai