Home వనపర్తి కిరోసిన్ పోసుకొని వృద్ధ దంపతుల ఆత్మహత్య

కిరోసిన్ పోసుకొని వృద్ధ దంపతుల ఆత్మహత్య

Old-Couple-Suicide

కొత్తకోట : మండల పరిధిలోని విలియం కొండ గ్రామంలో శుక్ర వారం సాయంత్రం కిరోసిన్ పోసుకొని బోయ సాయమ్మ(60)బుచ్చన్న(65) సంవత్సరాలు మృతి చెందారు. గ్రామస్తుల వివరాల ప్రకారం ఇద్దరు గ్రామంలోనే ఉంటూ జీవనం కొనసాగించేవారని తమ కుమారులు హైద్రాబాద్‌కు వలస వెళ్లడం జరిగిందని వారు తెలిపారు . అప్పులు తీవ్రంగా ఉండడంతో జీవనం గడువడం కష్టంగా మారడంతో ఇంట్లో ఇద్దరు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సిఐ శ్రీనివా సులు, ఎస్‌ఐ రవికాంత్ రావులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు .