Home ఆదిలాబాద్ వృద్ధ దంపతుల ఆత్మహత్య

వృద్ధ దంపతుల ఆత్మహత్య

Suicideఆదిలాబాద్ : పొచ్చెర జలపాతంలోకి దూకి వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముస్కు సుదర్శన్, ప్రమీల దంపతులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో ఉంటున్నారు. అయితే వీరు కొంతకాలంగా కుటుంబ, ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో మనస్తాపానికి గురైన సుదర్శన్, ప్రమీల పొచ్చెర జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం సుదర్శన్, ప్రమీల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Old Couple Commits Suicide In Neradigonda At Adilabad