వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో ఓ వృద్ధుడు చనిపోయాడు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నర్సింహులు(67) అనే వృద్ధుడు రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. దీంతో నర్సింహులు ఘటనాస్థలిలోనే చనిపోయాడు. మృతుడు నర్సింహులు గంగారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనాస్థలిని రైల్వే పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నర్సింహులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు వెల్లడించారు.