Home తాజా వార్తలు పాతనోట్లు పట్టివేత : ముగ్గురి అరెస్టు

పాతనోట్లు పట్టివేత : ముగ్గురి అరెస్టు

Old-notes

ఘజియాబాద్ : రూ.31.5 లక్షల విలువ గల రద్దయిన పాత నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ నోట్లను తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఓ కారులో పాత నోట్లను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ నోట్లను తరలిస్తున్న ప్రమ్‌జిత్‌సింగ్,రిషీకపూర్,శ్యామ్‌వీర్‌లను అరెస్టు చేశారు.అతుల్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.45 శాతం కమీషన్‌తో కొత్త కరెన్సీలోకి మార్చేందుకు వీటిని తీసుకెళుతున్నట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతుల్ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.