Home జోగులాంబ గద్వాల్ రైలు ఢీ : వృద్ధురాలు మృతి

రైలు ఢీ : వృద్ధురాలు మృతి

Old Woman Died In Train Accident At Jogulamba Gadwalజోగులాంబ గద్వాల : రైలు ఢీకొని ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ ఘటన ఇటిక్యాల మండల పరిధిలోని పెద్దదిన్నె గ్రామంలో మంగళవారం జరిగింది. పెద్దదిన్నెకు చెందిన గోవిందమ్మ (65) అనే వృద్ధురాలు రేషన్ బియ్యం తీసుకొని రైల్వే ట్రాక్ దాటికి ఇంటికి వెళుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. దీంతో గోవిందమ్మ ఘటనాస్థలిలోనే చనిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం గోవిందమ్మ మృతదేహాన్ని గద్వాల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసు అధికారి రామకృష్ణ తెలిపారు.