Home కరీంనగర్ పెన్షన్ కోసం వృద్ధురాలి పాట్లు

పెన్షన్ కోసం వృద్ధురాలి పాట్లు

Ballavva

ఇల్లంతకుంట: ప్రభుత్వం నెల నెల వృద్దులకు అందిస్తున్న పెన్షన్ డబ్బుల కోసం వృద్దులు నానా పాట్లు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం వృద్దులకు నెల నెల రూ.1500ల ను అందిస్తూ మంచి కార్యక్రమం చెపట్టుతున్నప్పటికి ఆ మంచి పేరు కాస్త విమర్శలకు తావిస్తుంది. ప్రతి నెల బ్యాంకుల ముందు క్యూలైన్ లో నిల్చుని పెన్షన్ డబ్బుల కోసం తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నామని వృద్దులు వాపోతు, ప్రభుత్వం చర్యల పై మండిపడుతున్నారు.

ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన బంగారు బాలవ్వ అనే వృద్దురాలు గత నాలుగు నెలలుగా నడవలేక పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు రాలేదు. దీంతో శుక్రవారం ప్లాస్టిక్ డబ్బాకు గుడ్డపెగులు కట్టుకుని అవస్థలు పడుతూ బ్యాంకుకు వచ్చి పెన్షన్ డబ్బులు తీసుకుంది. దీంతో ఈ ఫోటోను మనతెలంగాణ తన కెమోరాలో క్లిక్ మనిపించింది.