Home తాజా వార్తలు ఆర్‌టిసి బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

ఆర్‌టిసి బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

BUS

భద్రాద్రి కొత్తగూడెం: అశ్వరావుపేటలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఆర్‌టిసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు అశ్వరావుపేటలోని తూర్పు బజార్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.