Wednesday, March 22, 2023

పింఛన్లకోసం రోడ్డెక్కిన వృద్ధులు

- Advertisement -

pension

మన తెలంగాణ/దౌల్తాబాద్  ః  నెలనెలా అందించాల్సిన ఆసరా పింఛన్లు అందక లబ్దిదారులు ఆందోళనకు గురౌతున్నారు. గత రెండు నెలలుగా పింఛన్లు రావడం లేదని మండల పరిధిలోని నీటూరు,నర్సాపూర్ గ్రామాలకు చెందిన వృధ్ధులు శుక్రవారం మండల కార్యాలయం వద్ద బైఠాయించారు. నెలల తరబడి ఆసరా పింఛన్లు అందించకుంటే తమకు దిక్కేదని వారు ఆధికారులను నిలదీశారు. వారు మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల సమక్షంలో ఎంపిడిఓ సుధాకర్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. గత రెండు నెలలుగా ఈపింఛన్లు ప్రభుత్వం విడుదల చేయలేదని, ఇటీవలే ఒక నెల నిధులు వచ్చినప్పటికి ఇక్కడి బ్యాంక్‌లో సాంకేతిక లోపంతో బ్యాంకు నుండి డబ్బులు తీసుకోలేకపోవడంతో పోస్టాఫిసు ద్వారా పింఛన్ల్లు చెల్లించడంలో జాప్యం జరుగుతున్నదని ఎంపిడిఒ వారికి నచ్చజెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News