Thursday, April 25, 2024

భర్త కోసం 8 నెలలుగా తాళాలు వేసిన ఇంటిలోనే…

- Advertisement -
- Advertisement -

Older woman

 

భర్త కోసం వృద్ధురాలి ఎదురుచూపులు

మన తెలంగాణ / ముషీరాబాద్ : మళ్ళీ వస్తానని చెప్పి ఆమెను ఇంట్లోనే ఉంచి ఇంటికి బయటకు తాళంవేసి వెళ్లి ఎనిమిది నెలలు అవుతున్నా భర్త తప్పక వస్తాడని నమ్మి ఆ ఇంటి నుంచి బయటకు రాకుండా ఓ వృద్ధురాలు మరో చరిత్రను సృష్టించింది. ఎనిమిది మాసాలుగా ఇంటి ఓనరే కిటికీ ద్వారా ఇచ్చే ఆహారం తింటూ తాళం వేసి ఉన్న ఇంట్లోనే ఉన్న వృద్ధురాలి కథనం వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లాకు చెందిన గంగాధర్ రిటైర్డ్ ఎఆర్‌ఒ గత కొన్నేళ్లుగా ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ గణేష్‌నగర్ పరిసరాల్లోనే తన భార్య బేబి (76)తో నివసిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం రాములు అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు దిగారు. వీరికి సంతానం లేరు. డబ్బులు అవసరం పడినప్పుడల్లా భర్త గంగాధర్ కృష్ణా జిల్లాలోని తమ గ్రామానికి వెళ్లి వచ్చేవాడు. ఊరికెళ్లిన ప్రతిసారి బేబిని ఇంట్లోనే పెట్టి బయట నుంచి తాళం వేసి వెళ్లేవాడు.

ఆ తర్వాత వారం రోజులు, అప్పుడప్పుడు నెల వరకు వచ్చేవాడు. అలా గంగాధర్ ఊరికెళ్లిన ప్రతిసారి ఇంటి ఓనరే బేబికి కిటికి ద్వారా ఆహారాన్ని అందచేసేవారు. కానీ గత సంవత్సరం జులై మొదటి వారంలో ఊరికెళ్లిన గంగాధర్ 8 మాసాలైనా తిరిగి రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదని ఇంటి ఓనర్ రాములు తెలిపారు. దీంతో విషయాన్ని వారు ముషీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం పోలీసులు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘటనా స్థలానికి చేరుకోగా, ఇంటికి తాళం వేసి ఉంది. తాళాలు పగులకొట్టారు. వృద్ధాశ్రమంలో వేస్తాం బయటకు రావాలని బేబిని కోరగా, ఆమె నిరాకరించింది. అందరూ కలిసి ఆమెను సముదాయించి, చెంగిచెర్లలోని కరుణ రతమ్ ఫౌండేషన్ వృద్ధాశ్రామానికి బేబిని తరలించారు. అయితే ముషీరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ బేబి భర్త గంగాధర్‌కు ఫోన్ చేయగా, నెట్‌వర్క్ కలిసింది. ఫోన్ ఎత్తిన గంగాధర్ వెంటనే తిరిగి వస్తానని చెప్పినట్లు ముఠా గోపాల్ తెలిపారు.

Older woman expectations for husband
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News