Home తాజా వార్తలు తనలో తాను తిరిగే వింత ఉపగ్రహం

తనలో తాను తిరిగే వింత ఉపగ్రహం

Astoried

న్యూఢిల్లీ : ఉపగ్రహాలు లేదా అంతరిక్ష శిలలు శిలామయమైన చిన్న స్వరూపాలు. ఇవి సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. ప్రధానంగా ఇవి అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య మెయిన్‌బెల్టు అని చెప్పుకునే ఏరియాలో కనిపిస్తుంటాయి. కాలం చెల్లిన చాలా అంతరిక్ష శిలలు ఇటీవల భూమికి చేరువ కావడం తెలిసిందే. కానీ అవి భూమిని ఢీకొట్టలేదు. ఉపగ్రహాలు సునామీలు, ప్రమాదకర కెరటాలు, పెనుగాలులు వంటివి తెచ్చి ప్రళయం సృష్టిస్తుంటాయి. గురుత్వాకర్షణ శక్తి ప్రభావం కారణంగా ఇవి భూమి వైపునకు దూసుకు వస్తుంటాయి. అంతరిక్షంలో దాదాపు 7లక్షలకు మించి అంతరిక్ష శిలలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు తనలోతాను తెలియక తిరుగుతున్న కొత్త రకం ఉపగ్రహాన్ని కనుగొన్నారు. జర్మనీ లోని గర్చింగ్ వద్ద గల యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ కి చెందిన ఆలివర్ హెయినాట్ అనే పరిశోధకుడు ఈ విచిత్ర ఉపగ్రహం ఉనికిని కనుగొన్నారు.

దీనికి గౌల్టు అని పేరు పెట్టారు. ఇటువంటి స్వయం వినాశనం చాలా అరుదుగా జరుగుతుంది. గౌల్టు వంటి చురుకైన, చంచలమైన ఉపగ్రహాలు ఇప్పుడు కనుగొన బడుతున్నాయి. ఎందుకంటే కొత్త సర్వే టెలిస్కోప్‌లు ఆకాశాన్ని జల్లెడ పట్టగలుగుతున్నాయి. అంటే గౌల్టు వంటి అనుచిత వైఖరి కలిగిన గ్రహాలు పరిశోధన నుంచి తప్పించుకోలేవని ఆలివర్ పేర్కొన్నారు. హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఉపగ్రహం గౌల్టు చిత్రాన్ని పట్టుకోగలిగింది. ఈ ఉపగ్రహానికి తోకచుక్కల్లాంటి రెండు పొడవైన భాగాలున్నాయి. దుమ్ముతో కూడిన శిధిల తునకల రాశి ఉపగ్రహం (5478) గౌట్ నుంచి వెలువడుతోంది. ఈ తోకలు ఉపగ్రహం విడిచిపెట్టిన దుమ్ము తునకల సముదాయాలు, గౌట్ ఎలా ఏర్పడిందో తెలుసుకోడానికి కీలక సాక్షాలు. ఈ గౌట్ అసమగ్ర స్వరూపానికి వైఒఆర్‌పి ప్రభావంతో సంబంధం ఉంది. వైఒఆర్‌పి అంటే యార్కోవ్‌స్కీ,ఒ కీఫెరెడ్జ్‌యివిస్కిపడ్డక్ అనే నలుగురు శాస్త్రవేత్తల పేర్లతో కూడినది. ఈ ఆలోచనకు వారే రూపకర్తలు. సూర్యుని వేడి ఏ విధంగా ఉపగ్రహాన్ని వేడెక్కిస్తుందో ఫలితంగా అతినీల లోహిత కిరణాల (ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్) ధార్మికత ఏ విధంగా వేడి ఉపరితలం నుంచి తప్పించుకుని తనలో తాను తిరిగే పరిభ్రమణాన్ని ఎలా సృష్టిస్తుందో వైఒఆర్‌పి వివరించింది.

ఈ ప్రక్రియ ఉపగ్రహం నిరంతరం వేగంగా తిరిగేటట్టు చేస్తుంది. వంద మిలియన్ సంవత్సరాల వరకు ఈ ఉపగ్రహం గౌట్ తనలోతాను నెమ్మదిగా తిరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ మధ్యకాలంలో నాసా (నేషనల్ ఎయిరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ఒక కిలోమీటర్ పరిమాణం కన్నా మించిన పరిమాణం కలిగిన ఉపగ్రహాలు 900 వరకు ఉన్నాయని, అవి భూమి, సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తుంటాయని కనుగొన గలిగింది. ఈ 900లో అతి పెద్దది 34 కి.మీ వెడల్పుతో ఉంటుందని వివరించింది. సైన్స్ విభాగం

Oliver Heyi Not Found New Astoried