Thursday, April 25, 2024

వచ్చే ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్

- Advertisement -
- Advertisement -

Olympics

 

టోక్యో: జపాన్ వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల కొత్త షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించారు. ఈ ఏడాది టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా వేశారు. ఇక, ఈ క్రీడలకు సంబంధించిన తాజా షెడ్యూల్‌ను అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది. 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఈ క్రీడలు జరుగుతాయి. నిర్వహణ కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ను వాయిదా వేయక తప్పలేదు. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న తరుణంలో ఈ ఏడాది ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యం కాలేదు. దీన్ని ఒక ఏడాది పాటు వాయిదా వేయాలని జపాన్ ప్రభుత్వం ఒలింపిక్స్ కమిటీని కోరింది.

దీంతో 2021లో ఈ క్రీడలను నిర్వహించాలని ఐఓసి నిర్ణయించింది. ఇక, తాజాగా ఈ క్రీడలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐఓసి ప్రకటించింది. క్రీడలు వచ్చే ఏడాది జరుగుతున్నా దీన్ని 2020 ఒలింపిక్స్‌గానే పరిగణిస్తారు. అంతేగాక ఇప్పటికే ఈ క్రీడలకు అర్హత సాధించిన క్రీడాకారులే ఒలింపిక్స్‌లో పోటీ పడుతారు. దీని కోసం కొత్త అర్హత పోటీలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆదివారమే ఒలింపిక్స్ కమిటీ స్పష్టం చేసింది. కాగా, జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు జరుగనున్నాయి. ఈ క్రీడల కోసం జపాన్ అధునాతన సౌకర్యాలతో కూడిన క్రీడా ప్రాంగణాలను నిర్మించింది. చరిత్రలో చిరకాలం గుర్తుండి పోయేలా క్రీడలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే కరోనా మహమ్మరి ప్రభావం ఈ మెగా క్రీడలపై కూడా పడింది. కరోనా తీవ్ర రూపం దాల్చిన తరుణంలో పోటీలను వాయిదా వేయాలని పలు దేశాలు కోరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పోటీలను వాయిదా వేయడమే మంచిదని సూచించారు.

ఇక, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ తదితర దేశాలు క్రీడలను వాయిదా వేయక పోతే పోటీల నుంచి తప్పుకుంటామని హెచ్చరించాయి. దీంతో జపాన్ ప్రభుత్వం ఏడాది పాటు క్రీడలను వాయిదా వేసేందుకు సిద్ధమైంది. ఇక, క్రీడలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించారు. కాగా, వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జపాన్ స్పష్టం చేసింది. మిగిలి పోయిన ఏర్పాట్లను త్వరలోనే పూర్తి చేసి చిరకాలం గుర్తుండి పోయేలా క్రీడలను నిర్వహిస్తామని ప్రకటించింది. కాగా, టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన పదివేల మంది క్రీడాకారులు పోటీ పడే అవకాశాలున్నాయి.

 

Olympics from July 23 next year
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News