- Advertisement -
అన్నమయ్య, రామదాసు, షిరిడీ సాయి తర్వాత రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయా’. ఈ చిత్రం ఆడియోలాంచ్ ఆదివారం జరిగింది. ఈ వేడుకలో ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. తిరుమల వెంకటేశ్వరస్వామి పరమ భక్తుడు హాథీరాం బాబా జీవితగాథ ఆధారంగా సాయి కృపా బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయికలుగా అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం దర్శకత్వం వహించారు. రావు రమేశ్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
- Advertisement -