Friday, March 29, 2024

యాంటీబాడీస్‌ను హరించే బిఎ 4 , 5

- Advertisement -
- Advertisement -

Omicron Ba4, 5, which depletes antibodies

ఒమిక్రాన్ అనుబంధపు కొవిడ్ వేరియంట్లు

జోహెన్స్‌బర్గ్ : కరోనా వైరస్ అనుబంధపు ఒమిక్రాన్ అవశేషంగా పుట్టుకొచ్చిన వైరస్‌లు ప్రమాదకరమైనదని నిపుణులు తెలిపారు. ఈ రెండు వైరస్‌లు మనిషిలోని రోగనిరోధక కణాలను హరించివేస్తాయి. ఈ క్రమంలో వీటితో కరోనా నాలుగో వేవ్ తలెత్తుతుందనే భయాలు నెలకొంటున్నాయి. అయితే కొవిడ్ 19 నిరోధక వ్యాక్సిన్ పొందిన వారిని ఈ వైరస్‌లు ఏమీ చేయలేవని దక్షిణాఫ్రికా సైంటిస్టుల అధ్యయనంలో తేల్చారు. ఈ కొత్త వేరియంట్లను ఒమిక్రాన్ బిఎ 4, బిఎ 5గా వ్యవహరిస్తున్నారు. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ నిశిత పరిశీలనల జాబితాలోకి చేర్చుకుంది. వీటి వ్యాప్తి , ప్రభావ క్రమాన్ని పరిశీలిస్తోంది. ఈ దశలోనే దక్షిణాఫ్రికా సైంటిస్టులు ఈ రెండు వేరియంట్లపై అధ్యయనం చేశారు. ఇంతకు ముందు ఒమిక్రాన్ వచ్చి పోయిన 39 మంది రక్తపు నమూనాలను సేకరించి అధ్యయనాలు జరిపారు. ప్రయోగాలకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారిలో 15 మంది వ్యాక్సిన్లు పొందిన వారు, ఎనమండుగురు ఫైజర్ షాట్స్, ఏడుగురు జాన్సన్ టీకాలు పొందిన వారు ఉన్నారు. ఇక మరో 24 మంది ఎటువంటి టీకాలు పొందకుండా ఉన్నవారు ఉన్నారు.

టీకాలు పొందిన వారిలో దాదాపు ఐదింతలు వరకూ వైరస్ తటస్థీకరణ శక్తి ఉందని వెల్లడైంది. వీరు వైరస్ నుంచి రక్షణ కవచాన్ని పొందారు. అయితే టీకాలు పొందని వారిలో కొందరికి ఇప్పుడు తలెత్తిన కొత్త వేరియంట్లు సోకినట్లు, వీరిలో ఎక్కువ మందిలో వీటి ప్రభావంతో యాంటీబాడీస్ హరించుకుపోయినట్లు వెల్లడైంది. అంతకు ముందటి ఒమిక్రాన్ వచ్చినప్పుడు తలెత్తిన యాంటీబాడీస్ క్షీణతతో పోలిస్తే వీరిలో దాదాపు ఎనిమిదింతల వరకూ ఎక్కువగా రోగనిరోధక కణాలు హరించుకుపోయినట్లు వెల్లడైంది. అయితే వ్యాక్సిన్లు పొందిన వారిలో ఈ వైరస్‌లు సోకినట్లు అయితే యాంటీబాడీల క్షీణత మూడింతలుగా ఉందని నిర్థారించారు. దక్షిణాఫ్రికాలో ఇప్పుడు కరోనా ఐదో దశకు చేరుకొంటోంది ఇందుకు కారణం ఇప్పుడు తలెత్తిన బిఎ 4, బిఎ 5 రకాలేనని సైంటిస్టులు నిర్థారించారు. 6 కోట్ల జనాభా గల ఆఫ్రికాలో ఇప్పుడు కేవలం 30 శాతం మందికే పూర్తిస్థాయిలో టీకాలు పడ్డాయి. దీనితో ఇప్పుడు వచ్చిపడ్డ రెండు వేరియంట్లు ఎటువంటి పరిణామానికి దారితీస్తాయనే భయాలు నెలకొంటున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News