Saturday, April 20, 2024

ఒమిక్రాన్‌లో తీవ్రస్థాయి లక్షణాలు లేవు : ఆంటోనీ ఫౌచీ

- Advertisement -
- Advertisement -

Omicron does not have severe symptoms: Anthony Fauci

వాషింగ్టన్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌లో డెల్టా వేరియంట్ కంటే స్వల్ప లక్షణాలు కలిగి ఉన్నట్టు ప్రారంభ నివేదికల బట్టి తెలుస్తోందని, అయితే ఈ లక్షణాలపై ఒక తీర్మానం చేసే ముందు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సూచించారు. వైద్య నిపుణులను ఉద్దేశించి ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. దక్షిణాఫ్రికా ఈ కొత్త వేరియంట్‌పై ప్రపంచాన్ని అప్రమత్తం చేయగానే అక్కడి నుంచి రాకపోకలు సాగించేవారిపై అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ తీరును ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఖండించారు. ఇది పారదర్శకతను దెబ్బ తీస్తుందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పౌచీ స్పందిస్తూ తమ దేశం ఆ నిషేధాన్ని సరైన సమయంలో ఎత్తి వేస్తుందని ఆశిస్తున్నానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News