Home టెక్ ట్రెండ్స్ ఏప్రిల్ 24న షియోమీ రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

ఏప్రిల్ 24న షియోమీ రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

Shioimi Redmi 7 smartphone

 

ప్రముఖ మొబైల్స్ సంస్థ తన వినియోగదారులను ఆక‌ట్టుకునే ఫీచర్ల‌తో మరో సరికొత్త షియోమీ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7 ను ఏప్రిల్ 24వ తేదీన తాజాగా ఇండియన్ మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ఖరీదు సంబంధించిన వివ‌రాల‌ు ఇలా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.26 ఇంచుల ఫుల్ హెచ్‌డి ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు కెమెరాలు ఉండ‌గా, ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. 2/3/4 జిబి ర్యామ్‌, 16/32/64 జిబి  ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ రూ.7,150  వినియోగ‌దారుల‌కు ల‌భించానుంది.

షియోమీ రెడ్‌మీ 7 ఫీచర్లు… 

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 2/3/4 జిబి ర్యామ్‌, 16/32/64 జిబి స్టోరేజ్‌, 512 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వివోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఎహెచ్ బ్యాట‌రీ, వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు.