Home మంచిర్యాల ప్రజా సమస్యలపై..సమరశీల పోరాటాలు

ప్రజా సమస్యలపై..సమరశీల పోరాటాలు

cpi

*సిపిఐ 92వ వ్యవస్థాపక దినోత్సవంలో కార్యాచరణ
*సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను మరిచిన కెసిఆర్ ప్రభుత్వం
*సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు
*సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : ప్రజా సమస్యలపై సిపిఐ 92వ వ్యవస్థాపక దినోత్సవంలో కార్యాచరణ రూపొందించి సమరశీల పోరాటాలు చేపడుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్‌బెడ్‌రూం, దళితులకు మూడు ఎ కరాల వ్యవసాయ భూములు ఇచ్చే వరకు  సిపిఐ ప్రజా ఉద్యమాలు చేపడుతుందన్నారు. సింగరేణి కార్మికులకు  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం పూర్తిగా విస్మరించారని, సింగరేణి కారుణ్య నియామకాల పేరిట కార్మికులు మోసగి ంచారని ఆరోపించారు. ముఖ్యంమత్రి స్వయంగా సింగరేణి కార్మికులకు దసరాకు ఓటు వేయండి, దీపావళికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వగా సంక్రాంతి సమీపిస్తుందని ఇప్పటి వర కు ఉద్యోగాల  జాడలేదన్నారు.  సింగరేణి సంస్థ  నిర్వీర్యం చేసేందుకు  కుట్రలు జరుగుతున్నాయని, కార్మికులు  ఇలాంటి  కుట్రలను వ్యతిరేకించాలన్నారు. ఆదివాసీ లంబాడీల ప్రచ్చన్న యుద్ధానికి ప్రభుత్వమే కారణమని ఈ సమస్యలపై  అఖిల పక్ష పార్టీతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఎంఆర్‌పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగను భేషరత్‌గా విడుదల చేయాలని ఆయన డి మాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం చిచ్చుపెడుతుందని, అదే విధంగా కోర్టు నుంచి మందకృష్ణ స్టే రాకుండా ప్రభుత్వమే అడ్డుకుంటుందని, ఉద్యమాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సింగరేణి ఎన్నికల్లో ఎఐటియుసి ఓటమి పాలు చే సేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి కార్మికులను మబ్యపెట్టారని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాలను పునరేకరణ చేయాల్సిన అవశ్యకత ఎంతైన ఉందని, కలిసి వచ్చే పార్టీలతో, శక్తులతో ఏకమై ప్ర జా ఉద్యమాలు నిర్మించేందుకు సన్నద్దం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కేసిఆర్‌ను ఏకాకి గా చేసి, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పేందుకు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయన్నారు. తెలంగాణ వస్తే మన నీళ్లు, నిధులు మనకే లభిస్తాయని ఆశించగా నిరాశ ఎదురైందన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత సింగరేణిలో గ్రామాలను బొందలగడ్డలుగా మార్చే ఓపెన్‌కాస్టులు ఉండవని భావిస్తే ప్రజా ఉద్యమాలను లెక్కచేయకుండా ఓపెన్‌కాస్టుల ఏర్పాటు యాదావిధిగా కొనసాగుతుందన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుండా మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, భూమాఫియా పెట్రేగిపోతుందని సంబంధీకులపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నా రు. వెనుకబాటు తనాన్ని దృష్టిలో పెట్టుకొనే రిజర్వేషన్లు తేవాలని, ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్నికల కోణంలో ఆలోచించి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్, నాయకులు కలవేణ శ్యాం, లింగమూర్తి, దేవి పోచన్న, డాక్టర్‌శంకరయ్య, చాడ మహేందర్‌రెడ్డి, మేకల దాస్, నగేష్, కొప్పుల రాజు, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.