Home ఆదిలాబాద్ ఐదవ తరగతి విద్యార్థి పై కత్తితో దాడి

ఐదవ తరగతి విద్యార్థి పై కత్తితో దాడి

On the fifth class student attacked with a knife
కుబీర్ : మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో కొనసాగుతున్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఐదవ తరగతి చదువుతున్న విద్యారి పై జరిగిన కత్తి పోట్ల సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఇటివలే ఈ పాఠశాలలో 5వ తరగతిలో అడ్మీషన్ తీసుకున్న హర్షావర్ధన్ అనే విద్యార్థి పై గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. హర్షావర్ధన్ నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని చామన్ పెల్లి గ్రామం. గురుకుల పాఠశాలలోకి మద్యాహ్నం వేలలోనే కాకుండ రాత్రి వేలలో ఇతరులేవరికి ప్రవేశం ఉండదు. విద్యార్థులను వారి తల్లిదండ్రులు గాని ఇతర బందువులు గాని కలవాలనుకుంటే సంబందిత పాఠశాల ప్రిన్సిపాల్ అనుమతి తప్పనిసరి. అయితే విద్యార్థులను బయటకు వెళ్లకుండా, బయటవారు లోనికి రాకుండా చూసేందుకు వాచ్‌మెన్లను సైతం ప్రభుత్వం నియమించింది. విద్యార్థులు నిద్రించే గదికి తలుపులు లేకపోవడంతో గదిలో చొరబడి అగాంతకుడు వాచ్‌మెన్ల కండ్లు కప్పి విద్యార్థి హర్షావర్ధన్ పై కత్తితో రెండు చోట్ల పొడిచాడు. ఈ కత్తి పోట్లకు గురైన బాధితుడు హర్షావర్ధన్ అరవడంతో విద్యార్థులు, వాచ్‌మెన్, ఉపాధ్యాయుడు మేల్కొని అతని వద్దకు వచ్చే లోపే అగాంతకుడు పారిపోయినట్టు చెప్పుతున్నారు. ఈ కత్తి పోట్ల కారణంగా తీవ్ర గాయాలైన హర్షావర్ధన్‌ను ఉపాధ్యాయుడు ఉఠాఉఠిన భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం గాయాలపాలైన హర్షావర్ధన్ కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నింధితుని కోసం గాలిస్తుండడమే కాకుండ ఈ సంఘటనకు గల కారణాలను తమదైన శైలీలో శోధిస్తున్నారు. ఇదిలా వుండగా ప్రతి రోజు ప్రశాంతంగా ఉండే తమ పాఠశాలలో తోటి విద్యార్థి పై అనూహ్యంగా జరిగిన దాడిని మిగత విద్యార్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సంఘటన కారణంగా పాఠశాల విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని తమ విద్యార్థులను ఆరా తీస్తున్నారు. మరికొంత మంది సంఘటకు భయాందోళనకు గురై తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్ళారు. భైంసా టౌన్ సీఐ వి. శ్రీనివాస్, ఆర్‌సివొ బి. శోభరాణి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై కే. రమేష్, టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం రాజేశ్వర్, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎన్నిల అనిల్, అలయ కమిటి చైర్మన్ బొప్పనాగలింగం, విఆర్వో ముత్తన్న తదితరులు పాఠశాలను సందర్శించారు.