Home జాతీయ వార్తలు పిఒకెలో మళ్లీ భూకంపం… భయాందోళనలో ప్రజలు

పిఒకెలో మళ్లీ భూకంపం… భయాందోళనలో ప్రజలు

 

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మరోసారి భూకంపం సంభవించింది. పిఒకెలో ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మీర్పూర్‌కు 4 కి.మీ దూరంలో భూమికి 12 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.
కాగా, మంగళవారం పిఒకెలో సంభవించిన భారీ భూకంపంతో 37 మంది చనిపోగా, 500 మందికి పైగా గాయాలయ్యాయి. పలు చోట్ల భవనాలు కూలిపోగా… రోడ్లు చీలిపోవడంతో వాహనాలు ధ్వంసం అయ్యాయి. తాజాగా మరోసారి భూమి కంపించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Once again Earthquake in Pakistan occupied Kashmir