Home సినిమా ఒక్కటైన రణ్‌వీర్,దీపిక

ఒక్కటైన రణ్‌వీర్,దీపిక

Deepika-And-Ranvir-నేడు సింధి సంప్రదాయంలో మరోసారి పెళ్లి
బాలీవుడ్ స్టార్ జంట దీపిక పదుకునే, రణవీర్ సింగ్‌ల వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలోని లేక్ కొమోలో కొంకణి సంప్రదాయంలో వీరి పెళ్లి కన్నుల పండువగా జరిగింది. పెళ్లికి ముందు నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇక దీపిక వేలికి ఉంగరాన్ని తొడిగిన అనంతరం రణవీర్ ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. ఈ వివాహ మహోత్సవంలో అందగత్తె దీపిక పదుకునే ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించింది. ఈ వేడుకలో ఆమె సిగ్గులొలికిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చింది. దీపిక, రణవీర్ కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇక గురువారం సింధి సంప్రదాయంలో మరోసారి దీపిక పదుకునే, రణవీర్ సింగ్‌ల పెళ్లి జరుగుతుంది. అనంతరం ఈనెల 21న బెంగుళూర్‌లో, 28న ముంబయిలో వివాహ విందును ఏర్పాటుచేయనున్నారు. ఈ విందులో పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు.

 Once again in the Sindhi tradition Today 

Telangana News