Home జాతీయ వార్తలు నాలుగు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్

నాలుగు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్

Once again Lockdown in 4 districts in Tamilnaduచెన్నయ్ : తమిళనాడుపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు అధికం అవుతుండడంతో తమిళనాడు ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చెన్నయ్, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాల్లో ఈనెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సమయంలో ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 33 శాతం ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తామని, ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లల్లో పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. బయటకొచ్చేటప్పడు విధిగా భౌతికదూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.