Home జనగామ బొమ్మకూరు రిజర్వాయర్ లో ముగ్గురు గల్లంతు

బొమ్మకూరు రిజర్వాయర్ లో ముగ్గురు గల్లంతు

Bommakuru Reservoir

జనగామ:  స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీ కోసం ప్రయత్నించి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కాలుజారి రిజర్వాయర్‌లో పడి గల్లంతైన సంఘటన జిల్లాలోని నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ వద్ద జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు గల్లంతైన వారికోసం గజ ఈతగాళ్ల సహయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి స్వస్థలం రఘునాథ్‌పల్లి మండలంలోని మేకలగుట్ట గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

One Boy and Two Girls Missing in Bommakuru Reservoir