Home తాజా వార్తలు ఒక కోటి 42 లక్షల ఎకరాల్లో పంటలు సాగు: నిరంజన్ రెడ్డి

ఒక కోటి 42 లక్షల ఎకరాల్లో పంటలు సాగు: నిరంజన్ రెడ్డి

40 Lakh capacity metric tons warehouses

హైదరాబాద్: రైతులు పంటసాగు చేసుకునేందుకు రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడిగా సాయం అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసన సభలో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతు వేదికల నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఉండేలా చర్యలు తీసుకున్నామని, తెలంగాణలో ప్రస్తుతం కోటి 42 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర నుంచి ఇంకా లక్షకు పైగా మెట్రిక్ టన్నుల యూరియా రావాలన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని కితాబిచ్చారు.