Home సినిమా టీజర్‌కు కోటి వ్యూస్

టీజర్‌కు కోటి వ్యూస్

Mahesh

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న ‘స్పైడర్’ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. ప్రేక్షకులు, అభిమానులు ఈ టీజర్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీంతో విడుదలైన మొదటి 24 గంటల్లోనే 8.6 మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం 10 మిలియన్లు అనగా కోటి వ్యూస్‌ను తాకేసింది. ‘బాహుబలి’ని మినహాయిస్తే ఓ తెలుగు మూవీ టీజర్ ఇంత వేగంగా కోటి వ్యూస్‌ను అందుకోవడం ఇదే మొదటిసారి. దీన్నిబట్టి చూస్తే ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల ఎంత ఆసక్తి నెలకొనిఉందో అర్థమవుతుంది. ‘భయపెట్టడం మాకూ వచ్చు…’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలకానుంది. మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్‌వి ప్రసాద్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ వలన ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఎస్.జె.సూర్య, భరత్‌లు ప్రతి నాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ఆడియో ఇంకా రిలీజ్ కానప్పటికీ బూమ్ బూమ్… అనే ఒక్క పాటను లాంచ్ చేశారు. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 27న ‘స్పైడర్’ను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు ఫిల్మ్‌మేకర్స్.