Home తాజా వార్తలు లారీని ఢీకొట్టిన డిసిఎం

లారీని ఢీకొట్టిన డిసిఎం

చిట్యాల: లారీని డిసిఎం ఢీకొట్టిన సంఘటన శనివారం ఉదయం నల్లగొండ జిల్లాలోని చిట్యాలలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి  దుర్మరణం చెందాడు.  ముందుగా వెళ్తున్న ఓ లారీనీ వెనక నుంచి డిసిఎం అదుపు తప్పి ఢీకొట్టడంతో డిసిఎం డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కపోయాడు. డ్రైవర్ ను బయటకు తీయగానే అతడు మృతి చెందాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా నాగేశ్వరరావుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.