Home తాజా వార్తలు బస్సు ఢీ కొని యువకుడు మృతి

బస్సు ఢీ కొని యువకుడు మృతి

Road-Accidentహైదరాబాద్ : నగరంలోని లంగర్‌హౌజ్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం యాకుత్‌పూరాకి చెందిన మీర్ అహ్మద్, నాజర్‌వలీ రాజేంద్రనగర్‌లోని ఆషూర్ ఖానా దర్శనం కోసం వెళ్తుండగా సిబిఐటి కాలేజికి చెందిన బస్సు వెనుక నుంచి వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో నాజర్‌అలీ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో స్థానికులు ఆగ్రహంతో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.