Home నాగర్ కర్నూల్ కారు, బైక్ ఢీ: ఒకరి దుర్మరణం

కారు, బైక్ ఢీ: ఒకరి దుర్మరణం

Died

వెల్దండ: కారు, బైకు ఢీకొన్న సంఘ టనలో ఓ వ్యక్తి మృతి చెం దాడు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రం స మీపంలోని హైదారాబాద్-శ్రీశైలం రహదారిపై ఆదివారం ఈ ప్రమా దం చోటు చేసు కుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన బావండ్ల శ్రీనివా సులు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తమ ద్విచక్ర వాహనంపై ఆమనగల్లు నుం చి వెల్దండ వైపు వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు, శ్రీనివాస్ రెడ్డిని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా శ్రీనివాస్ మృతి చెందిన ట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమా రుడు, కూతురు ఉన్నారు.