Home తాజా వార్తలు పందిని తప్పించబోయి కారు బోల్తా…

పందిని తప్పించబోయి కారు బోల్తా…

Accidentరంగారెడ్డి: శంషాబాద్‌ మండలం పాలమాకుల వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పందిని తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే స్థానిక దవాఖానకు తరలించారు. మృతుడిని వినయ్‌ కిషోర్‌గా గుర్తించారు. స్థానికులు సమచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

One Died in Car Rollover At Shamshabad