- Advertisement -
మెదక్ : నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మూడు బైక్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్న ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -