* బావిలో మృతి చెందిన బర్‌మ్రోల్ల శంకర్
*సంఘటనస్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ
మనతెలంగాణ, ముథోల్
మండలకేంద్రంలోని స్థానిక కోలిగల్లీకి చెందిన బర్‌మ్రోల్ల శంకర్ (48) అనే వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ముథోల్ ఎస్సై కోదాడి రాజు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి…. శంకర్ తనకున్నా రెండు ఎకరాల్లో వ్యవసాయ చేన్లలో వివిధ పంటలను పండిస్తు జీవనం కోనసాగిస్తున్నాడు. ఈ సంవత్సరం అనుకున్నంత స్థాయిలో పంటలు పండకపోవడంతో పంటలకు ఖర్చు చేసిన సుమారు రూ. 3లక్షల వరకు అప్పులైనట్లు వారు తెలిపారు. అప్పులు తీర్చెమార్గం లేక గత మూడు రోజుల నుండి ఇంటి నుండి బయటకివెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంభీలకు, బంధువులు, ఇండ్లలో వెతికిన ఆచూకి దొరకలేదు. మంగళవారం ఉదయం బావిలో శవమై తేలాడు. దీన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతునికి భార్య, కొడుకు, కుమారై ఉన్నారు. కుటుంభీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.