Home తాజా వార్తలు భారీ వర్షం… ప్లడ్ లైట్ టవర్ కూలి ఒకరి మృతి

భారీ వర్షం… ప్లడ్ లైట్ టవర్ కూలి ఒకరి మృతి

 LB Stadium

 

హైదరాబాద్: జంట నగరాల్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడమే కాకుండా విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. లక్డీకాపూల్ లో హోర్డింగ్ కూలడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అట్లాగే ఎల్ బి స్టేడియంలో ప్లడ్ లైట్ టవర్ కుప్పకూలడంతో నాలుగు కార్లు ధ్వంసం కావడంతో పాటు ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. వేంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు జిఎస్టి ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. జిహెచ్ ఎంసి సిబ్బంది కూలిన టవర్ ను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ దాన కిషోర్ చేరుకొని పరిశీంచారు.

ఈదురు గాలులు, భారీ వర్షం రావడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను జిహెచ్ ఎంసి అప్రమత్తం చేసింది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, సనత్ నగర్, బోరబండ, అబిడ్స్, నాంపల్లి, కోఠి, ఖైరతాబాద్, బషీర్ బాగ్, నారాయణగూడ,  నేరెడ్‌మెట్, బోయిన్‌పల్లి, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, తార్నాక, లాలాపేట్, సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, హెచ్‌బీ కాలనీ, జవహార్‌నగర్, ముషీరాబాద్, చిలకలగూడ, బేగంపేట, కుత్బుల్లాపూర్, చింతల్, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, సురారం, కాప్రా, మెహదీపట్నం ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గాలులకు చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగగా.. అంబర్ పేట్ లో భారీ వర్షం పడుతుంది.

One died with Flood Light Tower falls at LB Stadium