Home జాతీయ వార్తలు గన్ మిస్ ఫైర్ : ఒకరు మృతి

గన్ మిస్ ఫైర్ : ఒకరు మృతి

One Died With Gun MisFire In UPల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాజధాని ల‌క్నోలో ఓ ఎంఎల్ సి ఇంట్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోయారు.  స‌మాజ్‌వాదీ పార్టీకి చెందిన షాజాహాన్‌పూర్ ఎంఎల్ సి అమిత్ యాద‌వ్ ల‌క్నోలోని  హ‌జ్ర‌త్‌పూర్‌లో నివాస‌ముంటున్నారు. శుక్రవాం రాత్రి అమిత్ ఇంట్లో పుట్టిన‌రోజు పార్టీ జ‌రిగింది. ఈ క్రమంలో రాకేశ్ అనే యువకుడు త‌న తుపాకీని మ‌రో వ్య‌క్తికి ఇచ్చాడు.  ఈ క్రమంలో తుపాకీ మిస్ ఫైర్ అయి బుల్లెట్ రాకేశ్ త‌ల‌లోకి దూసుకెళ్లింది. దీంతో రాకేశ్ ఘటనాస్థలిలోనే చనిపోయాడు. ఈ కాల్పుల ఘ‌ట‌న శుక్ర‌వారం రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రాకేశ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.